అశ్రిత్ నుంచి లేటెస్ట్ సిగ్నేచర్ జ్యువెలరీ

ఆదివారం, 13 జనవరి 2019 (17:02 IST)
ఐశ్వర్య జ్యూవెలర్స్‌ అనుబంధ సంస్థ అశ్రిత్ జ్యూవెలరీ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా పలు రకాల సిగ్నేచర్ కలెక్షన్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గురుకృపా ఎక్స్‌పోర్ట్‌ అనుబంధ కంపెనీగా ఉన్న ఐశ్వర్య నుంచి ఏర్పడిన అశ్రిత్ జ్యూవెలరీ సంస్థ అత్యాధునిక మోడల్స్‌తో వీటిని తీసుకొచ్చింది.
 
ప్రధానంగా 12 రకాల నగలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఎంతో చూడముచ్చటగా, దేవుళ్లు, దేవతల విగ్రహాలతో తయారు చేశారు. ఇవి చూడటానికి మాత్రమే కాకుండా ధరించడానికి కూడా ఎంతో తేలికగా, సింపుల్‌గా ఉన్నాయి. నూతన ట్రెండ్‌ను ఫాలో అవుతున్న యువతకు ఇవి అచ్చుగుద్దినట్టుగా సరిపోతాయి. ఈ నగల ఆవిష్కరణ కార్యక్రమంలో అశ్రిత్ మార్కెటింగ్ హెడ్ గౌరంగ్ రమణి, సౌత్ మార్కెటింగ్ హెడ్ పరిమల్ రమణి తదితరులు పాల్గొన్నారు.
 
ఇదే అంశంపై ఐశ్వర్య జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ జయంతి రమణి మాట్లాడుతూ, దేవుళ్ళు, దేవతల నగల తయారీకి ఐశ్వర్య పెట్టింది పేరన్నారు. ముఖ్యంగా, ఆలయ సంస్కృతికి దక్షిణ భారతదేశం కేంద్రమన్నారు. ఇపుడు అశ్రిత్ నుంచి ఎన్నో కొత్త రకాల సిగ్నేచర్ జ్యూవెలర్స్‌ను ఆవిష్కరించినట్టు తెలిపారు. ఇవి యువతకు చేరువయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు