కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. ఇవి సుదూర రైళ్లతో ప్రారంభించినా.. తక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా ఎక్కువ ఛార్జీలు వసూళ్లు చేయడంతో వీటిల్లో ప్రయాణించేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించలేదు. రైల్వే బోర్డు, శుక్రవారం జోనల్ రైల్వేలకు రాసిన లేఖలో, రైళ్లు ప్రస్తుతం వాటి రెగ్యులర్ నంబర్‌లతో నడపాలని, కోవిడ్‌కు ముందు ఉన్న రేట్లే అమలు చేయాలని పేర్కొంది.