ప్రైమ్ డేకి ముందు సౌందర్య ప్రేమికులను కలపబోతున్న అమేజాన్ బ్యూటీ వెర్స్ 2025

ఐవీఆర్

ఆదివారం, 6 జులై 2025 (17:11 IST)
బెల్లా విటా, విష్ కేర్ మరియు యాక్సిస్-Y సహకారంతో మేబిలైన్ సమర్పించు అమేజాన్ బ్యూటీ వెర్స్ యొక్క రెండవ ఎడిషన్ తో అమేజాన్ ఇండియా ముంబయిని ఈ రోజు సౌందర్య ఆవిష్కరణగా మార్చింది. ప్రైమ్ డే 2025(జులై 12-14)కి ముందు నిర్వహించబడిన ఈ ఆహ్వానితులకు మాత్రమే కార్యక్రమం లీనమయ్యే సౌందర్య అనుభవం కోసం వర్క్ షాప్స్ కోసం ఒకే చోటకు 600 మందికి పైగా సౌందర్య ఔత్సాహికులను తెచ్చింది. ఈ కార్యక్రమంలో భూమి పడ్నేకర్, నీనా గుప్తా, కృతి సనన్, సుషాంత్ దివ్ గికర్, ప్రైమ్ సభ్యులు, క్రియేటర్లు, పారిశ్రామిక నాయకులు సహా బాలీవుడ్ దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. హైఫెన్, CeraVe, Laneige, TFIT, మిలాని, రియల్ టెక్నిక్స్, నాటికా ఫర్ హర్, లామెల్, ఇంకా ఎన్నో ప్రముఖ సౌందర్య బ్రాండ్స్‌కి చెందిన కొత్త విడుదలల ప్రత్యేకమైన ఫస్ట్ లుక్ ను హాజరైన వారు అందుకున్నారు.
 
“అమేజాన్ బ్యూటీవెర్స్ 2025ని పరిచయం చేయడానికి మేము ఉల్లాసంగా ఉన్నాము, ప్రైమ్ సభ్యులు, అమేజాన్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కోసం సౌందర్య ఆవిష్కరణను పునః ఊహించిన ప్రత్యేకమైన కార్యక్రమం,” అని సిద్ధార్థ భగత్, డైరెక్టర్ - అమేజాన్ బ్యూటీ, ఇండియా అన్నారు. “నిపుణులు నాయకత్వంవహించిన వర్క్ షాప్స్, ఇంటరాక్టివ్ షోకేసులు, బ్యూటీ టెక్ అనుభవాలతో సౌందర్య బ్రాండ్స్ యొక్క విస్తృతమైన ఎంపికను బ్యూటీ వెర్స్ ఒక చోట చేర్చింది. ప్రేరేపించడానికి, అవగాహన కలిగించడానికి రూపొందించబడిన ఈ ప్లాట్ ఫాం అమేజాన్ బ్యూటీ బాధ్యతను సమీకృత, ట్రెండ్-ఫార్వర్డ్, మరియు టెక్- ప్రారంభించబడిన బ్యూటీ ఆవిష్కరణ కోసం ఒక గమ్యస్థానంగా శక్తివంతం చేస్తోంది.”
 
జహీద్ ఖాన్, డైరెక్టర్- సెంట్రల్ షాపింగ్ ఎక్స్ పీరియెన్స్, అమేజాన్ ఇండియా, ఇలా అన్నారు, అమేజాన్‌లో, మేము క్రియేటర్స్‌తో ఏ విధంగా భాగస్వామం చేసుకుంటామో విషయానికి కమ్యూనిటీ రూపకల్పన కీలకం. భారతదేశంలో సౌందర్యాన్ని సంబరం చేయడానికి, తీర్చిదిద్దడానికి బ్యూటీ వెర్స్ తో, క్రియేటర్లు, బ్రాండ్స్, కస్టమర్లను ఒక చోటకు తీసుకు రావడం ద్వారా మేము ఈ సహకారాలను విస్తృతం చేస్తున్నాం. అమేజాన్ క్రియేటర్ సెంట్రల్, క్రియేటర్ యూనివర్శిటీ, మా AI-నాయకత్వంవహించిన వర్ట్యువల్ ట్రై-ఆన్ వంటి సాధనాల మద్దతుతో, క్రియేటర్లు గొప్ప కథలను చెప్పటానికి మేము సహాయపడుతున్నా, కస్టమర్లు సౌందర్యాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో కనుగొనడానికి, కొనుగోలు చేయడానికి  వీలు కల్పిస్తున్నాం.
 
నటి భూమి పెడ్నేకర్, ప్యానల్ లో భాగంగా ‘బ్యూటీ బియాండ్ బౌండరీస్: ఇండియాస్ గ్లోబల్ బ్యూటీ మువ్ మెంట్’ ఇలా అన్నారు, “అమేజాన్ బ్యూటీ వెర్స్ అనేది ఆన్ లైన్ అందం లీనమయ్యే ప్రయోగాలు, టెక్-ఆధారిత డయోగ్నిస్టిక్స్ వరకు ఎక్కడకు వెళ్తుందో- ప్రతి తాకిన అంశం అవాగహన, ప్రేరణ, నిమగ్నం చేయడానికి రూపొందించినట్లు భావించబడే ఒక శక్తివంతమైన ప్రదర్శన. ట్రెండింగ్ దేశీయ డెర్మా నుండి k-beauty బ్రాండ్స్ వరకు ప్రతిది క్రియేటర్లు, కస్టమర్లను ఒక చోట చేరడం చూడటం నేను ఎంతో ఇష్టపడ్డాను. సౌందర్యంలో తదుపరి ఏమిటో తీర్చిదిద్దడానికి అమేజాన్ ఏ విధంగా తన శాయశక్తులా పని చేస్తోందో చూడటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది.”
 
‘రీడిఫైనింగ్ ఇండియన్ బ్యూటీ: ఐకాన్స్, ఇన్ ఫ్లూయెన్సర్స్ & ఇన్ క్లూజివిటి’ అనే కార్యక్రమం ప్యానల్ లో నటి నీనా గుప్తా పాల్గొని, ఇలా అన్నారు, “కాలక్రమేణా సౌందర్యం యొక్క ఆదర్శాలు నాటకీయంగా మారడం నేను చూసాను. అమేజాన్ బ్యూటీ వెర్శ్ సానుకూలమైన అభివృద్ధిని చూపిస్తోంది - తరాల్లో స్వీయ-వ్యక్తీకరణ మరియు ప్రామాణికతను సంబరం చేసే స్థలం. నేటి వినియోగదారు తమ సౌందర్య ఎంపికల గురించి మరింత అవగాహనను, చైతన్యాన్ని కలిగి ఉన్నాడు, ఈ అవగాహనా వ్యవస్థను ప్రత్యేకించి సందర్భానికి తగినట్లుగా మారుస్తున్నారు. అందరికీ ప్రతి సందర్భానికి అనుకూలంగా ఉండే విధానానికి బదులు వ్యక్తిగతంగా తమకు ఉత్తమమైనది ప్రజలు గుర్తిస్తూ, స్వీకరించడంతో అందం ఏవిధంగా మరింత సమీకృతమైందో చూడటం అద్భుతంగా ఉంది.”
 
అమేజాన్ బ్యూటీ వెర్స్ కేవలం బ్యూటీ పోకడలు గురించి మాత్రమే కాదు- తమను తీర్చిదిద్దిన ప్రజలకు సంబంధించినది. ఒక క్రియేటర్ గా, అమేజాన్ తో ఈ ప్రయాణంలో భాగంగా ఉండటం అంటే భారతదేశంలో అందం ఏ విధంగా మరింత వ్యక్తీకరించబడుతోంది, సమీకృతమైనదో, సమాజంచే ప్రోత్సహించబడుతోందో చూడటానికి ముందు వరుస సీట్ లో కూర్చున్నామని భావించాలి” అని - యషి ట్యాంక్, క్రియేటర్ అన్నారు. మేబిలైన్, బెల్లా విటా, విష్ కేర్, హైఫెన్, CeraVe, ప్యాంటీన్, Axis-Y, Tir Tir, L'Oreal Paris, ఇన్నిస్ ఫ్రీ, Laneige, మేకప్ రివల్యూషన్ మరియు ఇంకా ఎన్నో వాటితో సహా కార్యక్రమం ప్రీమియర్ బ్యూటీ బ్రాండ్స్ ను ప్రదర్శించింది. సందర్శకులు ప్రత్యేకమైన ప్రైమ్ డే ప్రివ్యూ విడుదలల అనుభవం పొందారు మరియు రాబోయే బ్యూటీ టెక్ ఆవిష్కరణల మాస్టర్ క్లాసెస్ లో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు