సాస్, బహు ఔర్ సిక్సెస్, నెట్‌ఫ్లిక్స్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో క్రికెటర్ల సీక్రెట్స్

ఐవీఆర్

శనివారం, 5 జులై 2025 (20:31 IST)
పిచ్ పిచ్ సిద్ధంగా ఉంది, పంచ్‌లైన్‌లు కూడా అదే రీతిలో కొనసాగనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో భాగంగా ఈ వారం ఎపిసోడ్ క్రికెట్, ఊహాతీత సంఘటనలు, కామెడీతో నిండి ఉంది, ఇందులో గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, అభిషేక్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. నలుగురు మగాళ్లు, ఒక సోఫా... ఎలాంటి ఫిల్టర్‌లూ లేని సంభాషణలు... అంతే.
 
హోరాహోరీ మ్యాచ్‌ల సమయంలో లాకర్ రూమ్‌లోని మానసిక స్థితిని రిషబ్ పంత్ వెల్లడిస్తూ, లాకర్ రూమ్‌లో పరిస్థితి ఆటపై ఆధారపడి ఉంటుంది, మ్యాచ్ కాస్త అటుఇటుగా ఉన్నట్లు అయితే అది కొంచెం ఉద్రిక్తంగా ఉంటుందన్నారు. అవకాశం దొరికిందే తడవు వాయించేయటానికి సిద్ధంగా ఉన్న గంభీర్ తనకు లభించిన అవకాశమును ఉపయోగించుకుంటూ, కపిల్‌కి సమాధానమిస్తూ, “యే తో వోహీ బాత్ హై, అగర్ షో అచ్ఛా నా చల్ రహా హో తో కైసీ సిట్యుయేషన్ హో జాతీ హై, జో ఆప్కీ సిట్యుయేషన్ హై, వోహీ మేరీ సిట్యుయేషన్ హై. అగర్ టీమ్ అచ్ఛా నహి కర్తీ తో సబ్సే పెహ్లే కోచ్ బాహర్ జాతా హై, షో అచ్చా నహి హోగా తో సబ్సే పెహ్లే ఆప్ బహర్ జావోగే” ("ఇది కూడా మీ షో లాంటిదే , షో బాగా జరగకపోతే, మీకు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో, నా పరిస్థితి కూడా అంతే! జట్టు బాగా ఆడకపోతే మొదట బయటకు వెళ్లేది కోచ్, షో బాగా లేకపోతే మొదట బయటకు వెళ్లేది నువ్వేగా !") 
 
నిజమైన కపిల్ శైలిలో, ఎపిసోడ్ ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌తో ఉల్లాసకరమైన మలుపు తీసుకుంది, అది టీమ్ ఇండియాను ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంగా పునర్నిర్మించింది. టీమ్‌లోని జెథానీ- చుట్టుపక్కల అందరికీ బాస్‌గా ఉండే వ్యక్తి- ఎవరు అని అడిగిన ప్రశ్నకు- పంత్, "రోహిత్ భాయ్" (రోహిత్ శర్మ) అని ప్రకటించాడు. దేవ్రాణి విషయానికొస్తే, అంటే ఎక్కువగా గాసిప్ చేసే వ్యక్తి ఎవరనగానే పంత్, మొదట్లో అందరినీ చెప్పాడు కానీ, చివరికి సూర్య భాయ్ (సూర్యకుమార్ యాదవ్)అని నిర్దారించాడు. లాకర్ రూమ్ రహస్యాలను బయటపెట్టడం వల్ల కలిగే ప్రమాదం గురించి సిద్ధూ జోక్ చేసినప్పుడు, పంత్ తన భద్రతకు భయమేమీ లేదన్నట్లు నవ్వుతూ: “కోచ్ బైఠే  హు హై.” ( కోచ్ ఇక్కడే వున్నారు) అని అన్నారు. 
 
అర్చన పురన్ సింగ్ కూడా ఆ సందడిలో చేరి, హార్దిక్ పాండ్యా క్లాసిక్ డామద్ రకం- డిమాండ్ చేసేవాడు కావచ్చని అన్నారు. కుల్దీప్ యాదవ్ తన కోపంతో కూడిన ప్రవర్తన కారణంగా ఫుఫా జీ అని పిలువబడ్డాడు, అయితే జట్టు అధికారిక ఫిర్యాదు పెట్టె అయిన జిజా జీని ఏకగ్రీవంగా మొహమ్మద్ షమీకి ప్రదానం చేశారు. దీనికి గంభీర్, “జిజా దో సాల్ సే ఘర్ నేహిన్ ఆయా” అని జత చేశారు. జట్టులోని సాస్( అత్తగారు)ఎవరు- ఎల్లప్పుడూ కొంచెం అసంతృప్తిగా ఉంటారు? అన్నప్పుడు- పంత్, నవ్వుతూ, అది బుమ్రా అని అన్నాడు- “అతను కొన్ని వికెట్లు తీసినప్పుడు మాత్రమే కొంచెం సంతోషంగా ఉంటాడు" అని చెప్పుకొచ్చాడు. 
 
ఈ ఎపిసోడ్ కుటుంబ విషయాలతోనే ఆగదు. కపిల్ ఒక అద్భుతమైన ప్రశ్నను లేవనెత్తాడు: సెంచరీ చేయడం, డకౌట్ అవ్వడం మధ్య బాడీ లాంగ్వేజ్‌లో తేడా ఏమిటి?" అని. పంత్ తన వాగ్దాటితో" జో జీరో బనాకే జాతా హై వో సోచ్తా హై దూస్రే డ్రెస్సింగ్ రూం చలే జావు, జో సౌ బనాతా హై వో తో అప్నే పే ఆ జాతా హై" అని. (జీరో కొట్టి వెళ్ళేవాడు మరో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాలని అనుకుంటాడు, వంద కొట్టిన వాడు మాత్రం తన రూమ్ కు వెళ్తాడు.)  గంభీర్ వెంటనే  నిప్పులు చెరుగుతూ "జో సౌ బనాతా హై వో తో సోచ్తా హై కి హోటల్ చలా జావు తాకీ ఫీల్డింగ్ నా కర్నీ పాడే"(వంద పరుగులు చేసినవాడు ఫీల్డింగ్ చేయకుండా ఉండటానికి హోటల్‌కి వెళ్లాలని అనుకుంటాడు")  అని ! అన్నారు, 
 
ఇక జారవిడిచిన క్యాచ్‌ల విషయానికి వస్తే, "క్యాచ్ కిసీ సే భీ డ్రాప్ హో శక్తి హై, ఈజీ భీ డ్రాప్ హో సక్తా హై... లేకిన్ జబ్ సిక్సర్ లగ్తా హై తో కెమెరా ఆప్కే ఊపర్ హై హోతా హై!" (క్యాచ్ ఎవరైనా వదిలేయవచ్చు, ఈజీ వాటిని కూడా వదిలేయవచ్చు... కానీ సిక్సర్ కొట్టినప్పుడు కెమెరా మీపై ఉంటుంది!")  అని యూజీ టీమ్ ఆలోచనలను  అందంగా చెప్పాడు. వన్-లైనర్‌ల నుండి ఇన్‌సైడ్ జోక్‌ల వరకు, ఈ ఎపిసోడ్ క్రికెట్ అభిమానులకు తమకు అవసరమైనవే అయినప్పటికీ తెలియని ప్రతిదాన్ని అందిస్తుంది. కాస్త క్రికెట్‌తో పాటుగా హాస్యం , స్నేహం ఊహించండి - జూలై 5 న , నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు