అమేజాన్ బంపర్ ఆఫర్.. రూ.33వేల టీవీ రూ.5 వేలకే.. ఎలా?!

మంగళవారం, 1 అక్టోబరు 2019 (18:24 IST)
దసరాను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. తాజాగా అమేజాన్ కూడా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అమేజాన్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్55క్యూహెచ్‌డీఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.5,555కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వార్త విని అమేజాన్ వినియోగదారులంతా షాకవుతున్నారు. 
 
ఈ టీవిని చౌక ధరకే పొందాలనుకునేవారు.. మంగళవారం రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టీవీకి గాను నిర్వహించే ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాల్సి వుంది. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టీవీని సొంతం చేసుకోవచ్చునని అమేజాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమేజాన్ పలు వస్తువులపై ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లతో పాటు పలు రకాలకు చెందిన వస్తువులను ఈ సేల్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు