రూ.8 వేలకే యాపిల్ హెడ్ సెట్స్

శుక్రవారం, 13 జనవరి 2023 (14:03 IST)
యాపిల్ సంస్థ హెడ్ సెట్స్ విస్తరణ చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తుంది. తక్కువ ధరకు ఎయిర్ పాడ్స్‌ను ప్రవేశపెట్టే విషయంపై దృష్టిసారించింది. యాపిల్ 2024 ద్వితీయ ఆరు నెలల్లో అందుబాటు ధరకు ఇయర్ బడ్స్ విడుదల చేయొచ్చని ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా వేస్తున్నారు. ఒకవేళ జాప్యమంటూ జరిగితే 2025 నాటికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. 
 
ఇలా కొత్తగా తీసుకొచ్చే హెడ్ సెట్స్ ధర కనిష్టంగా రూ.8 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుంత ఎయిర్ పాడ్స్ కావాలంటే రెండో జనరేషన్ కోసం రూ.14900 చెల్లించాల్సివుంది. గత యేడాది యాపిల్ విడుదల చేసిన మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ ధర రూ.19900. 
 
యాపిల్ ఎయిర్ పాడ్స్ సరఫరాదారులను మార్చొచ్చనే అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టం ఉండి ధరను చూసి వెనక్కి తగ్గే వారిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి వారికి చౌక ధరకు అందించేందుకు వీలుగా వీటిని ప్రవేశపెట్టనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు