గోబౌల్ట్ పేరిట కొత్త గుర్తింపును ఆవిష్కరించిన బౌల్ట్

ఐవీఆర్

శనివారం, 9 ఆగస్టు 2025 (23:11 IST)
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేరబల్ బ్రాండ్ అయిన బౌల్ట్ దాని తదుపరి దశ విస్తరణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా కొత్త బ్రాండ్ పేరు గోబౌల్ట్, కొత్త లోగో విడుదల చేయటం తో పాటుగా మరింత దృష్టి కేంద్రీకరించిన వ్యాపార వ్యూహం, సాంకేతికత, డిజైన్,  రిటైల్ వృద్ధిలో గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. ప్రోత్సాహకరమైన రీతిలో ఆర్థిక సంవత్సరం 2025 ఫలితాల తర్వాత ఇది వస్తుంది. ఈ బ్రాండ్ గత ఆర్థిక సంవత్సరాన్ని రూ. 800 కోట్లతో ముగించింది, రెండేళ్లలో దాని ఆదాయాన్ని దాదాపు రెట్టింపు చేసింది. గోబౌల్ట్ ఆర్థిక సంవత్సరం 2026లో రూ.1,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది.
 
నేటి డిజిటల్-ఫస్ట్ వినియోగదారులు వేగవంతమైన జీవితాలకు అలవాటుపడ్డారు, భావి ఆలోచనలతో ఉంటున్నారు. అనుమతి కోసం వేచి ఉండకుండా వ్యవహరిస్తున్నారు. వారు తమతో పాటుగా వేగంగా కదిలే బ్రాండ్‌లను డిమాండ్ చేస్తున్నారు, గోబౌల్ట్ ఆ వేగాన్ని అందిస్తుంది. గో అనే పదం బ్రాండ్ యొక్క డిఎన్ఏలో అంతర్లీనంగా మిళితమైన వేగం, ఆశయం, పరివర్తనతో మనస్తత్వ మార్పును సూచిస్తుంది. ఈ పరివర్తన ఉత్పత్తి రూపకల్పన మరియు రిటైల్ విస్తరణ నుండి గ్లోబల్ పొజిషనింగ్, వినియోగదారు అనుభవం వరకు మొత్తం వ్యాపార వ్యూహంలో విస్తరించింది.
 
కొత్త బ్రాండ్ లోగో రెండు సంకేత అంశాలను కలిగి ఉంది. స్క్రూహెడ్ మరియు బాణం. అంతర్గత బలం, ఆవిష్కరణ, ఖచ్చితత్వాన్ని స్క్రూ కలిగి ఉంటుంది, అయితే బాణం మాత్రం బ్రాండ్‌లో గో అనే పదాన్ని జోడించడాన్ని సూచిస్తుంది, ఇది బ్రాండ్ భవిష్యత్ సాంకేతికతను నిర్మించడం, పరివర్తనలోకి కదలికను సూచిస్తుంది. సమిష్టిగా అవి గోబౌల్ట్ ఎవరు, బ్రాండ్ ఎక్కడికి వెళుతుందో ప్రతిబింబిస్తాయి. గోబౌల్ట్ సహవ్యవస్థాపకులు వరుణ్ గుప్తా మాట్లాడుతూ, బౌల్ట్ ఎల్లప్పుడూ నాకు బ్రాండ్ కంటే ఎక్కువే. ఇది ఒక అభిరుచి గల ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది, నేను హృదయపూర్వకంగా, ఉత్సాహంగా, నమ్మకంతో దీనిని అభివృద్ధి చేశాను. గోబౌల్ట్‌తో, ఇది కేవలం కొత్త పేరు కాదు; ఇది వ్యక్తిగత మైలురాయి.
 
మనం ఆలోచించే, నిర్వహించే, నిర్మించే విధానాన్ని మేము మారుస్తున్నాము. గోబౌల్ట్ అనేది తదుపరితరం యొక్క వేగం, వ్యక్తిత్వంతో సమలేఖనం చేయబడిన, సిద్ధంగా ఉన్న బ్రాండ్. ఈ రీబ్రాండ్ వేగంగా కదలడం, పెద్దగా ఆలోచించడం, భారతీయ ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం అనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. నా వరకూ, ఇది మార్పును కొనసాగించడం గురించి మాత్రమే కాదు, దానిని నడిపించడం. గోబౌల్ట్ అనేది పునర్నిర్మాణం, రీబూట్ మరియు మేము సేవ చేసే యువత వలె ధైర్యంగా ఉన్న గ్లోబల్ ఇండియన్ టెక్ బ్రాండ్‌ను సృష్టించే దిశగా ఒక ముందడుగు అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు