పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. ఇందుకోసం పాకిస్థాన్‌తో పాటు పాక్ ప్రేరిపిత ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. అదేసమయంలో పాకిస్థాన్‌కు టర్కీ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లతో పాటు సైనికులను కూడా పంపించింది. ఇది భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. టర్కీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, టర్కీకి వాణిజ్యపరంగా ఎదురుగాలివీస్తోంది. టర్కీ సంస్థలతో భారత్ సంస్థలు, వర్శిటీలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఇలా భారత్ ఎఫెక్ట్ పడిన టర్కీ కంపెనీల్లో సెలెబీ సంస్థ కూడా ఒకటి. ఇది భారత విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించండి.
భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దెబ్బకు ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్లో మే 16న కంపెనీ షేరు ఏకంగా పది శాతం కుప్పకూలిపోయింది. గత నాలుగు వాణిజ్య పనిరోజుల్లోనే ఈ సంస్థ షేరు దాదాపు 30 శాతం మేరకు ఆవిరైపోయింది. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలను సెలిబీ అనుబంధ సంస్థ అందిస్తున్న విషయం తెల్సిందే.