తిరుపతిలో ఇసుజు మోటార్స్ ఇండియా షోరూమ్

ఐవీఆర్

గురువారం, 15 మే 2025 (22:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో, ఇసుజు మోటార్స్ ఇండియా ఈరోజు తిరుపతిలో ఆర్‎కేఈ ఇసుజు యొక్క 3S ఫెసిలిటిను ప్రారంభించింది. ఆటో నగర్ దగ్గర, రేణిగుంట రోడ్డు, తిరుపతిలో వ్యూహాత్మకంగా ప్రారంభించబడిన ఈ సదుపాయము అందరికి సులభంగా అందుబాటులో ఉంటుంది. నారాయణాద్రి ఆసుపత్రి సమీపములో ఉంది.
 
ఈ ప్రాంతములో ఇసుజు యొక్క వాహనాల శ్రేణి కొరకు, ముఖ్యంగా అత్యధికంగా-అమ్ముడయ్యే తన మోడల్స్ ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్, రెగ్యులర్ క్యాబ్ కొరకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ కొత్త షోరూమ్ నెరవేరుస్తుంది. ఈ వాహనాలు వాణిజ్య, జీవనశైలి అవసరాలు రెండిటిలో విశ్వసనీయమైన, అధిక-పనితీరు పికప్స్ కోరుకునే వినియోగదారులలో బలమైన ట్రాక్షన్ పొందింది. షోరూమ్‌లో వాహనాల డెలివరీలు ఈరోజే ప్రారంభం కానున్నాయి.
 
ఆర్‎కేఈ ఇసుజు దశాబ్ద కాలముగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతములో బ్రాండ్ కు ప్రాతినిథ్యం వహిస్తూ ఇసుజు కుటుంబములో ఒక అంతర్గత భాగంగా ఉంది. ఆర్‎కేఈ ఆటో ఇండియా ప్రై లి. ద్వారా నడిపించబడే ఈ గ్రూప్ ఇతర ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్స్ ను కూడా, ఆటోమోటివ్ రీటెయిల్ ల్యాండ్‎స్కేప్ తో అత్యధిక అనుభవము మరియు విశ్వాసముతో నిర్వహిస్తుంది.
 
ప్రారంభము గురించి మాట్లాడుతూ, శ్రీ తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇలా అన్నారు, “తిరుపతి మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్, ఒక కొత్త షోరూమ్ తో మా ఉనికిని బలోపేతం చేయుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఆర్‎కేఈ ఇసుజు సుమారు 10 సంవత్సరాలుగా ఒక విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంది. వినియోగదారుడి అవసరాల గురించి వారి లోతైన అవగాహన ఈ ప్రాంతములో మా అభివృద్ధికి కీలకం అయింది. ఈ కొత్త సదుపాయము ఉత్కృష్టమైన వినియోగదారుడి అనుభవాన్ని అందించుటకు, విశ్వసనీయత, పనితీరు, నమ్మకము పట్ల ఇసుజు యొక్క విలువలను పునరుద్ఘాటించడములో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.” 
 
శ్రీ. జి బాలాజి చౌదరి, డీలర్ ప్రిన్సిపల్, ఆర్‎కేఈ ఇసుజు ఇలా అన్నారు, “ఇసుజు మోటార్స్ ఇండియాతో భాగస్వామ్యాన్ని తిరుపతిలో ఈ కొత్త షోరూమ్‌తో కొత్త స్థాయిలకు తీసుకెళ్ళడం మాకేంతో గౌరవకారణంగా ఉంది. గత దశాబ్ద కాలంగా, మా వినియోగదారులతో ధృఢమైన సంబంధాలనుఏర్పరచుకున్నాము. ఈ కొత్త ఫెసిలిటి వారికి ఇంకా ఎక్కువ సౌకర్యము, మొత్తం ఇసుజు ఉత్పత్తి శ్రేణికి మెరుగైన యాక్సెస్ ను అందించడము ద్వారా మరింత మెరుగైన సేవలను అందించుటలో మాకు దోహదపడుతుంది.”

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు