సిలిండర్ బుకింగ్‌కు కొత్త నెంబర్

గురువారం, 29 అక్టోబరు 2020 (09:34 IST)
ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ నవంబరు నుంచి వంటగ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ కోసం కొత్త టెలిఫోన్‌ నెంబరు పరిచయం చేసింది. ఈ సంస్థకు 1.36 కోట్ల మంది వంటగ్యాస్‌ వినియోగదారులున్నారు. వినియోగదారులు 8124024365 అనే టోల్‌ ఫ్రీ నెంబరులో సంప్రదించి వాయిస్‌ మెసేజ్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా బుకింగ్‌ చేయవచ్చు. అదే విధంగా వాట్సాప్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఈ నెంబరు ద్వారానే అధిక శాతం వినియోగదారులు సిలిండర్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. ఈ విషయమై ఆ సంస్థ అధికారి మాట్లాడుతూ, వంటగ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసేందుకు ఓ ప్రైవేటు సమాచార సంస్థతో చేసుకున్న ఒప్పందం ముగిసిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం నవంబరు నుంచి వినియోగదారులు 7718955555 అనే నెంబరు వినియోగించి సిలిండర్‌ బుకింగ్‌ చేసుకోవాలని తెలిపారు. అదే సమయంలో ఈ నెల 31వ తేది వరకు పాత టెలిఫోన్‌ నెంబరునే వినియోగించాలని ఆయన సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు