గ్యాస్ సిలిండర్లపై బాదుడే బాదుడు.. ఇంటికి రూ.50... అంగటికి రూ.350 పెంపు

బుధవారం, 1 మార్చి 2023 (08:26 IST)
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలను సమీక్ష చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో మార్చి ఒకటో తేదీన చేపట్టిన ధరల పునః సమీక్ష విధానంలో గృహాలకు సరఫరా చేసే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచారు. 
 
అలాగే, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరను రూ.350గా పెంచారు. ఈ పెంపుతో వంట గ్యాస్ ధర మరింతగా పెరిగింది. ఫలితంగా అన్ని వ్యాపార దుకాణాల్లో, హోటళ్ళలో తయారు చేసే అన్ని రకాల తినుబండరాల ధరలు పెరగనున్నాయి. 
 
తాజాగా పెంపుతో హైదరాబాద్ నగరంలో వంట గ్యాస్ ధర రూ.1,155కు చేరుకుంది. గత నెలలో ఈ ధర రూ.1,105గా ఉండేది. అలాగే, ఢిల్లీలో ఈ ధర రూ.1,103కు చేరుకోగా, వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119.50కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఈ యేడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా, ఈ యేడాది జనవరి ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధర రూ.25 పెరిగిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు