వంట నూనెలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై రాయితీతో కూడిన దిగుమతి సుంకాల ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
వచ్చే ఏడాది మార్చి చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది.
దేశీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్‌పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగి వచ్చాయని, అందువల్ల దేశీ మార్కెట్‌లో కూడా కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది.