పెరిగిన బంగారం, దిగొచ్చిన వెండి..

శనివారం, 3 జులై 2021 (09:40 IST)
బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు దిగొస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. అయితే ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అయితే వెండి ధర విషయానికొస్తే కిలో వెండిపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
 
దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.
 
ఇక దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, చెన్నైలో రూ.73,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,900 ఉండగా, విజయవాడలో రూ.73,900 వద్ద కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు