ముహూర్తాలు.. డిమాండ్.. బంగారం ప్రియులకు షాక్..

శనివారం, 21 మే 2022 (09:51 IST)
బంగారం ప్రియులకు షాక్. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. 
 
దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.
 
తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 46,700 కి చేరింది. 
 
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగి రూ. 50, 950 కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు