ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీ మరోమారు పొడగింపు!

గురువారం, 3 డిశెంబరు 2020 (17:57 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కటీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆఖరు తేదీలోను పొడగిస్తూ పోతున్నారు. తాజాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు తేదీని కేంద్రం మరోమారు పొడగించింది. ఇప్పటికే ఆఖరు తేదీ డిసెంబరు 31వ తేదీ వరకు ఉండగా, ఇపుడు మరోమారు పొడగించింది. 
 
కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ)... ఈ గడువును పొడిగించిందని ఆదాయపు పన్ను శాఖట్విట్టరులో వెల్లడించింది. 
 
ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ఫైలింగ్ తేదీ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని ఆర్థికమంత్రిత్వశాఖ పొడిగించడం ఇది రెండోసారి. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటిసారి నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మే నెలలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పొడిగించారు. దీంతో నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేని వారికి కాస్త ఉపశమనం కలిగినట్టు అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు