2019-20 ఆర్థిక సంవత్సరానికి సమర్పించాల్సిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఆడిట్ చేసిన పద్దులు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శనివారం నాడు ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించారు. ఇక ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు, అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పణకు ఈ డిసెంబరు 31 వరకు సమయం కల్పించింది.