04-08-2025 సోమవారం ఫలితాలు - మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు...

రామన్

సోమవారం, 4 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పొదుపు ధనం అందుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాల్లో మెళకువ వహించండి. హామీలివ్వవద్దు. అయిన వారి సలహా పాటించండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కష్టించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం, సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండండి. ఆశించిన అవకాశం చేజారిపోతుంది. నిరాశకు లోనవుతారు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. అనవసర జోక్యం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ముఖ్యమైన పత్రాలు నగదు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార దక్షతతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అపరిచితులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఖర్చులు విపరీతం. రావలసిన ధనంపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి అధికం. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ కష్టం వృధాకాదు. శుభవార్త వింటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యదీక్షతోనే అనుకున్నది సాధిస్తారు. సాయం ఆశించవద్దు. ఖర్చులు సామాన్యం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. గృహ మరమ్మతులు చేపడతారు. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు