జార్ఖండ్ రాష్ట్రంలో పలు కంపెనీలు వరుసగా మూతపడుతున్నాయి. దీంతో ఆ కంపెనీల్లో పని చేస్తూ వచ్చిన కార్మికులు వలసలు పోతుననారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలకు డిమాండ్ బాగా పడిపోయింది. దీంతో జార్ఖండ్ రాష్ట్రంలోని స్టీలు కంపెనీల యాజమాన్యాలు, కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. అమ్మకాలు సన్నగిల్లడం వల్ల రాజధాని జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ బ్లాక్ తరచూ మూతబడుతోంది. గత నెల నుంచి ఇప్పటి వరకు ఈ బ్లాక్‌ను నాలుగుసార్లు మూసేశారు.