ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదేసమయంలో సబ్సీడీకి ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్ల ధర కూడా రూ.1000కి చేరువయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసమే ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. దీనిపై ఇప్పటికే అంతర్గతంగా చర్చించినట్టు సమాచారం.
ఎంపిక చేసిన కొందరి వినియోగదారుల వార్షిక ఆదాయం రూ.10 లక్షలలోపు ఉండాల్సివుంటిద. అంతకు మించివున్నట్టయితే గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వరు. దీంతో అవసరమైన ప్రజలకే గ్యాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అదేసమయంలో రాయితీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యలో కూడా పరిమితి విధించే అవకాశాలు లేకపోలేదు.