బొలెరో నియో+ను ఆవిష్కరించిన మహీంద్రా, ధర రూ. 11.39 లక్షల నుంచి ప్రారంభం

ఐవీఆర్

బుధవారం, 17 ఏప్రియల్ 2024 (22:40 IST)
భారతదేశంలో దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా కొత్తగా బొలెరో నియో+ 9 సీటర్‌ను ఆవిష్కరించింది. ఇది P4, ప్రీమియం P10 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రైవర్‌ సహా 9 మంది ప్రయాణికులకు అనువైన, స్టైలిష్‌గా, విశాలంగా, దృఢంగా ఉండే ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్ల కోసం ఈ ఎస్‌యూవీ రూపొందించబడింది.
 
విశ్వసనీయమైన, శక్తిమంతమైన, ఎలాంటి ప్రదేశానికైనా వెళ్లగలిగే బొలెరో గుణాలతో బొలెరో నియో+ 9-సీటర్ రూపొందించబడినది. దీనికి స్టైలిష్ బోల్డ్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్లు, నియో యొక్క టెక్నాలజీ అదనం. పెద్ద కుటుంబాలు, సంస్థాగత కస్టమర్లు, టూర్స్, ట్రావెల్ ఆపరేటర్లు, కంపెనీలకు వాహనాలను లీజుకి ఇచ్చే కాంట్రాక్టర్లు మొదలైన వర్గాల అవసరాలకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీ తీర్చిదిద్దబడింది.
 
“ఏళ్ల తరబడి నిలకడగా, అంచనాలను మించే పనితీరుతో, భారీతనానికి, విశ్వసనీయతగా మారుపేరుగా బొలెరో బ్రాండు కస్టమర్ల ఆదరణను చూరగొంటోంది. కుటుంబాలకు, ఫ్లీట్ ఓనర్లకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా అధునాతన ఫీచర్లతో అత్యంత సౌకర్యవంతంగా, మన్నికైనదిగా బొలెరో నియో+ను తీర్చిదిద్దాము” అని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో శ్రీ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు.
 
ఎక్కడికైనా ప్రయాణించగలిగే సామర్థ్యాలు గల శక్తిమంతమైన వాహనం:
సమర్ధమంతంగా ఇంధనం ఆదా చేసేందుకు, మెరుగైన పనితీరును అందించేందుకు బొలెరో నియో+లో మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీతో భారీ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ అమర్చబడింది. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణం, అత్యంత దృఢమైన ఉక్కు బాడీ షెల్ అనేవి అత్యంత మన్నిక మరియు భద్రతను అందించేలా తీర్చిదిద్దబడ్డాయి. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం EBDతో ABS, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX చైల్డ్ సీట్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఆటోమేటిక్ డోర్ లాక్స్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో పొందుపర్చబడ్డాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు