కాగా, కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంలో భాగంగా, దేశంలో ఉన్న పది ప్రధాన బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా అవతరించాయి. వీటిలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి విలీనం చేశారు.
ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా శాఖలు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
అలాగే, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు. ఫలితంగా ఇది నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అదేవిధంగా అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులోనూ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులోను విలీనం చేశారు. దీంతో దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది. ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి.