దేశ సంస్కృతి ఉట్టిపడేలా, ప్రజలందరికీ అర్ధమయ్యే రీతిలో డీఎఫ్ఐ పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని.. ఆగష్టు 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోగా ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచినవారికి రూ. 5 లక్షలు, రెండో స్థానానికి రూ. 3 లక్షలు, మూడో స్థానానికి రూ. 2 లక్షలు బహుమతులుగా అందజేస్తామన్నారు.
దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థమయ్యేలా పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్‌ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపాల్సి ఉంటుంది.