నేటి నుంచి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై 7.11 శాతం వడ్డీ

ఆదివారం, 1 జనవరి 2023 (12:11 IST)
కొత్త సంపత్సరంలో తమ ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు శుభవార్త చెప్పాయి. భారత రిజర్వు బ్యాంకు ఇటీవల రెపో రేటును పెంచాయి. దీంతో అనేక బ్యాంకులు ఎఫ్.డిలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇంకొన్ని బ్యాంకులు బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై పడ్డీ పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇలాంటి బ్యాంకుల్లో కొత్తగా ఏర్పాటైన ఏజ్ బ్యాంకు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పొదుపు ఖాతాలపై సంవత్సరానికి 7.11 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం దేశంలో అధిక మొత్తంలో వడ్డీని అందిస్తున్న బ్యాంకు ఖాతాలు ఇవేనని పేర్కొన్నాయి. 
 
అయితే, రూ.5 లక్షల నుంచి రూ.25లక్షల వరకు బ్యాంకు బ్యానెల్స్ ఉన్న ఖాతాలపై 7.11 శాతం వడ్డీని అందుబాటులో ఉంటుందని బ్యాంకు చెబుతున్నప్పటికీ సేవింగ్స్ ఖాతపై వడ్డీ రోజువారీగా లెక్కించబడుతుంది. అయితే, అది ప్రతి మూడు నెలలోకాసిరి కస్టమర్ ఖాతాలో జమ చేయబడుతుంది. కొత్త వడ్డీ రేట్లు జనవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు