ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ విరుగుడుకు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తలమునకలైవున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్ వంటి దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టే పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి.
దీంతో సాధ్యమైనంత త్వరగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చి, దేశ ప్రజలను రక్షించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలు కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఆ దేశంలో ఇప్పటికే పలు టీకాలు ఆఖరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి.
అసాధ్యం అనుకున్న పనిని అగ్రరాజ్యం సాధ్యం చేసి చూపిస్తున్నదని, పరిశోధకుల పనితీరు భేష్ అని అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. కాగా, అమెరికాలో విరుచుకుపడుతున్న మహమ్మారి ఇప్పటికే 1.87 లక్షల మందిని పొట్టనపెట్టుకున్నది. ఇప్పటివరకు 62 లక్షల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు.