46 ఏళ్ళ కనిష్ఠ స్థాయికి.. పీపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయా?

సోమవారం, 22 జూన్ 2020 (16:29 IST)
దాదాపు 46 ఏళ్ళ కనిష్ఠ స్థాయికి పీపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇప్పటికే... అంటే మూడు నెలలుగా తగ్గిపోతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపీఎఎఫ్‌ వడ్డీ రేట్లు హెచ్చుగా ఉంటే ఉద్యోగులకు ఊరటగా ఉంటుంది. కానీ పీపీఎఫ్ వడ్డీ రేట్లను జులైలో సవరించనుంది. ఫలితంగా పీపీఎఎఫ్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయని తెలుస్తోంది. 
 
అంతేగాకుండా.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై వడ్డీ రేట్లను కూడా తగ్గించనున్నారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్లపై వడ్డీ రేట్లను కూడా... జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో 1974 తర్వాత పీపీఎఫ్ వడ్డీ రేట్లు ఏడు శాతం కంటే తక్కువకు పడిపోయిన సందర్భం ఇదే అవుతుందని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. అదే సమయంలో పదేళ్ల బాండ్‌పై జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ సరాసరిన 6.42 శాతంగా ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకూ బాండ్లపై వడ్డీ ఆదాయం సరాసరిన 6.07 శాతంగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు