భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ తన హోమ్ అప్లియెన్సెస్ రిమోట్ మేనేజ్‌మెంట్ (హెచ్ఆర్ఎం) సాధనాన్ని ప్రారంభించింది, ఇది సేవా నిరీక్షణ సమయాలను గణనీయంగా తగ్గించి, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే తదుపరి తరం రిమోట్ డయాగ్నసిస్, ట్రబుల్ షూటింగ్ పరిష్కారం. ఏఐ - ఆధారిత రిమోట్ డయాగ్నస్టిక్స్, ట్ర ట్రబుల్ షూటింగ్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా, సామ్‌సంగ్ సాంకేతిక నిపుణులు ఇప్పుడు సమస్యలను వేగంగా పరిష్కరించగలరు, ఇంటి సందర్శనల అవసరాన్ని తగ్గించ గలరు. ఈ వినూత్న సాంకేతికత వేగవంతమైన పరిష్కారాలు, తగ్గిన డౌన్‌టైమ్‌తో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. కస్టమర్ కేర్ భవిష్యత్తును పునర్నిర్వచిస్తుంది. వినియోగదారులు, వారి స్మార్ట్ గృహోపకరణాల మధ్య సంబంధాన్ని తిరిగి కొత్తగా రూపొందిస్తుంది.
"గృహ ఉపకరణాల సమస్యల నిర్ధారణలో సామ్‌సంగ్ సర్వీస్ ముందంజలో ఉంది. కచ్చితత్వంతో సమస్యలను గుర్తించడానికి అధునాతన సాధనాలను ఉపయోగించుకుంటుంది. తన స్మార్ట్ డయాగ్నస్టిక్స్ సేవ ద్వారా, వినియోగదారులు రిమోట్‌గా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా చురుకైన పరి ష్కారాలను పొందవచ్చు. ఇది సాంకేతిక నిపుణులు వినియోగదారుల ఇంటిని సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. అంతేగాకుండా వేచి ఉండే సమయాన్నికూడా ఈ పురోగతి గణనీయంగా తగ్గిస్తుంది. వేగవంతమైన పరిష్కారాలను నిర్ధారిస్తుంది. ఉత్పత్తి నిర్వహణపై సకాలంలో నవీకరణలను అందిస్తుంది. అంతి మంగా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరు స్తుంది, ”అని సామ్‌సంగ్ ఇండియా కస్టమర్ సాటిస్‌ఫ్యాక్షన్ వీపీ సునీల్ కుటిన్హా అన్నారు.
స్మార్ట్‌థింగ్స్ యాప్‌లో రిజిస్టర్ చేయబడిన సామ్‌సంగ్ స్మార్ట్ ఉపకరణాల కోసం రిమోట్ కౌన్సెలింగ్, పర్యవేక్షణ, నియంత్రణ ఫీచర్లతో హెచ్ఆర్ఎం రియల్-టైమ్ సమస్య పరిష్కారాలకు వీలు కల్పిస్తుంది. స్మార్ట్‌థింగ్స్ అనేది కస్టమర్-ఫేసింగ్ యాప్. ఇది ఉపకరణ నిర్వహణ సాధనంగా పనిచేస్తుంది. వినియోగ విధానాలను గ్రహిస్తుంది. ఈ ఆవిష్కరణతో సామ్‌సంగ్ స్మార్ట్ పరికర నిర్వహణలో ముందుంది, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు గృహోపకరణ నిర్వహణను మరింత సమర్థవంతంగా, ఇబ్బంది లేకుండా చేస్తుంది. కస్టమర్ తమ గృహోపకర ణంలో సమస్య గురించి సామ్‌సంగ్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించినప్పుడు హెచ్ఆర్ఎం సిస్టమ్ సామ్‌సంగ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఆర్ఎం) ద్వారా రిజిస్టర్డ్ పరికరం మోడల్, సీరియల్ నంబర్‌ను ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది. యాక్టివేషన్ తర్వాత, కాంటాక్ట్ సెంటర్ అడ్వయిజర్స్ కస్టమర్ సమ్మతి తర్వాత రిమో ట్‌గా సమస్య నిర్ధారణ చేయవచ్చు, పర్యవేక్షించవచ్చు. కొన్ని ఉపకరణాల విధులను కూడా నియంత్రించ వచ్చు, తక్షణ ట్రబుల్ షూటింగ్ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
ఏసీ కూలింగ్ సమస్యను ఎలా పరిష్కరించింది
చెన్నైలో వేసవి త్వరగా రావడం, ఉష్ణోగ్రత 35⁰C కంటే ఎక్కువగా ఉండటంతో, రోహన్ లూత్రా ఎయిర్ కండిషనర్ తక్కువగా చల్లదనాన్ని అందిస్తోంది. అదృష్టవశాత్తూ, రోహన్ తన స్మార్ట్‌ఫోన్‌లో స్మార్ట్‌థింగ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నందున, ఏసీ ఇప్పటికే యాప్‌లో నమోదు చేయబడినందున, అతనికి ఎర్రర్ నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే, రోహన్ స్మార్ట్‌థింగ్స్‌లో హోమ్ కేర్ సర్వీస్ ద్వారా సపోర్ట్ కోరారు. కాంటాక్ట్ సెంటర్ అడ్వయిజర్‌కు కనెక్ట్ అయ్యాడు. సంప్రదించిన తర్వాత, ఆ అడ్వయిజర్హె చ్ఆర్ఎం రిమోట్ డయాగ్నస్టిక్స్ ద్వారా సమస్యను గుర్తించాడు. దాని మైక్రోఫిల్టర్ శుభ్రపరచడం అవసరమని కస్టమర్‌కు తెలియజేశారు. ఫోన్ కాల్ ద్వారా రోహన్‌కు దశల వారీ గైడెన్స్ ను అందించాడు, ఆన్-సైట్ సందర్శన అవసరం లేకుండా నిమిషాల్లో ఏసీ కూలింగ్ సామ ర్థ్యాన్ని పునరుద్ధరించాడు. ఈ వాస్తవ ప్రపంచ ఉదాహరణ సామ్‌సంగ్ హెచ్ఆర్ఎం సాధనం కస్టమర్ మద్దతును ఎలా మారుస్తుందో, స్మార్ట్ ఉపకరణాల నిర్వహణను మరింత సమర్థవంతంగా, చురుగ్గా, ఇబ్బంది లేకుండా చేస్తుందో నొక్కి చెబుతుంది.