పట్టలేనంతగా పెరిగిన పసిడి ధరలు.. 55వేలు దాటిందిగా!

మంగళవారం, 28 నవంబరు 2023 (14:13 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఆరు నెలల గరిష్టానికి చేరింది. ప్రస్తుతం ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,015 డాలర్ల వద్ద ఉంది. దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా మారలేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,350 వద్దకు చేరుకుంది. 
 
ఇంకా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560 వద్దకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.46,920 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.81,500గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.57,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,710గా నమోదైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు