2.75 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసిన టెలికాం కంపెనీలు!

ఠాగూర్

బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:08 IST)
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కఠిన చర్యలు తీసుకుంటుంది. ట్రాయ్ ఆదేశాల మేరకు.. స్పామ్ కాల్స్ ఏ మొబైల్ నంబర్ల నుంచి వస్తున్నాయో గుర్తించిన టెలికాం కంపెనీలు ఆయా నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. ఈ ప్రకారంగా ఇప్పటివరకు 2.75 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేశాయి. 
 
స్పామ్ కాల్స్ చేస్తూ, స్పామ్ మెసేజ్‌లు పంపుతున్న 50 సంస్థలను కూడా బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పామ్ కాల్స్ ద్వారా టెలికాం వనరులను దుర్వినియోగం చేస్తున్న వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలను అన్ని టెలికాం కంపెనీలు అమలు చేయాలని, తద్వారా స్వచ్ఛమైన టెలీ కమ్యూనికేషన్ల వ్యవస్థ ఏర్పడేందుకు తోడ్పాటు అందించాలని ట్రా పిలుపునిచ్చింది.
 
కాగా, ఈ యేడాది జనవరి నుంచి జూన్ వరకు స్పామ్ కాల్స్‌కు సంబంధించి 7.9 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే, అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు