కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో మరోమారు బడ్జెట్‌ను ప్రవేసపెట్టారు. ఈ బడ్జెట్‌లో నవ్యాంధ్ర, బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు. అయితే, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం పూర్తికాలం మనుగడ కొనసాగించాలంటే బీహార్ రాష్ట్రం నుంచి జేడీఎస్, ఏపీ నుంచి టీడీపీకి చెందిన ఎంపీల సంపూర్ణ మద్దతు అత్యంత కీలకంగా మారింది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.
వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాతతరం సంస్కరణలు.. ఈ తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.
2024-25 బడ్జెట్ అంచనాలు రూ.48.21 లక్షల కోట్లు.
జీడీపీలో 4.9 శాతంగా ఉండనున్న ద్రవ్యలోటు.
వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధన లక్ష్యంగా చర్యలు.
ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యం.
కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్ల ఏర్పాటు.
పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధనకు చర్యలు.
సహకార రంగాన్ని సుస్థిరం చేసేందుకు నిర్మాణాత్మక విధానాల రూకపల్పన.
వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్ల ఏర్పాటు.
సేకరణ, సరఫరా, నిల్వకు అవసరమైన పెట్టుబడులను అందుబాటులోకి తేవడం లక్ష్యం.
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు
వచ్చే ఐదేండ్లలో నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు.
కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది.
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపుల్లో నాలుగేండ్ల పాటు ప్రోత్సాహకాలు.
ఎంప్లాయిమెంట్ ఇన్సెంటివ్‌ల కోసం మూడు పథకాలు.
అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయం.. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు
పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి.
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు