'బిగ్ బాస్' తొమ్మిదో సీజన్ రియాలిటీ షో విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం కూడా మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం హౌస్ నుంచి హరిత హరీశ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పటికే మనీశ్ మర్యాద, ప్రియాశెట్టి అనే ఇద్దరు కామనర్లు, కొరియోగ్రాఫర్ శ్రష్టి శర్మలు ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రకటించిన తర్వాత ఇతర కంటెస్టెంట్స్ గురించి హరీశ్ అభిప్రాయాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అందులోభాగంగా, పైకి ఒకలా లోపల మరోలా ఉండే ముగ్గురి ఫోటోలను బ్లాక్ మాస్క్ వద్ద పెట్టమనగా భరణి, పవన్, ఇమ్మాన్యుయేల్ ఫోటోలు పెట్టారు. నిజాయితీగా ఉండే వారి ఫోటోలు వైట్ మాస్క్ వద్ద పెట్టమనంగా శ్రీజ, కళ్యాణ్, తనూజ ఫోటోలను పెట్టారు. మాస్క్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన హరీశ్.. తాను ఉన్నన్ని రోజులు గుండుతోనే ఉంటాని చెప్పిన సంగతి తెల్సిందే. ఒత్తిడిలో ఉన్నపుడు తనకు బిగ్ బాస్ ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.