అమెరికాలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ జాతీయ బ్యాంకును మూసివేశారు. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బ్యాంకును అమెరికా మూసివేయించింది. పాకిస్థాన్ దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ (హెచ్.బి.ఎల్) ఒకటి. ఇది 40 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్‌లోనూ ఈ బ్యాంక్ సేవలు అందిస్తోంది. అయితే ఈ బ్యాంక్ ఉగ్రవాదులకు డబ్బు సాయం చేస్తున్నదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
2006లోనే ఆ పని మానుకోవాలని అమెరికా ఈ బ్యాంక్‌ను హెచ్చరించింది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నది. అయినా హబీబ్ బ్యాంక్ తీరు మారకపోవడంతో ఇక న్యూయార్క్ శాఖను మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆ బ్యాంక్‌కు రూ.1437 కోట్ల భారీ జరిమానాను కూడా విధించింది అక్కడి విదేశీ బ్యాంకుల నియంత్రణ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్.