బీసీసీఐ చుట్టు వివాదాలు.. పరిష్కారం కోసం రూ.4900 కోట్లు

ఆదివారం, 3 డిశెంబరు 2017 (09:47 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చుట్టూ కుప్పలుతెప్పలుగా వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది. 
 
ముఖ్యంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ ద్వారా కాసుల వర్షం కురిపించుకున్న బీసీసీఐ.. మరోవైపు అనేక వివాదాలు కొనితెచ్చుకుంది. ఇపుడు వీటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రూ.4900 కోట్లు చెల్లించనుంది. 
 
ఇందులోభాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009తో) వేసిన కేసులకు సంబంధించి దాదాపు రూ.2420 కోట్లు, ఇతర న్యాయపరమైన కేసులు, కొచ్చి టస్కర్స్‌కు నష్టపరిహారం కింద రూ.1250 కోట్లు, ఆదాయపన్ను చెల్లింపునకు రూ.540 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.600 కోట్లు, సేల్స్ ట్యాక్స్/వ్యాట్ రూ.90 కోట్లు, సీసీఐ జరిమానా రూ.52.54 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు