డీఆర్డీవోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

సోమవారం, 7 నవంబరు 2022 (13:44 IST)
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ మరియు పరిశోధనా సంస్థ (డీఆర్డీవో)లో కొత్తగా 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ పోస్టులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. ఈ పోస్టులకు అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేనీ విశ్వవిద్యాలయం, విద్యా సంస్థ నుంచి పోస్టును బట్టి పదో తరగతి లేదా సంబంధిత స్పషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణతను సాధించివుండాలి. 
 
ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్‌ స్కిల్స్ అవసరం. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో విధానంలో వచ్చే నెల ఏడో తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.100, ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయించారు. రాత పరీక్ష ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత సాధించిన వారికి రూ.19 వేల నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు