జేఎన్‌టీయూ - హైదరాబాద్‌లో భర్తీకాని ఇంజనీరింగ్ సీట్లు

ఠాగూర్

ఆదివారం, 10 ఆగస్టు 2025 (12:13 IST)
సాధారణంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ సీట్లు వస్తే అది జాక్‌పాట్‌‍తో సమానం. ముఖ్యంగా, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇలా ఏదైనా సరే.. సీటు వచ్చిదంటే నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పక్కాగా వస్తుందన్న నమ్మకం ఉండేది. 
 
అయితే, ఈ యేడాది సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ముగిసేసరికి క్యాంపస్‌లో 13 బ్రాంచుల్లో 58 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లోనే 30 సీట్లు మిగిలాయి. చాలామంది విద్యార్థులు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.లక్షల డొనేషన్లు చెల్లించి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేరుతుండగా.. క్యాంపస్‌లో మాత్రం సీట్లున్నాయి. 
 
ఎస్సెట్ మెరుగైన ర్యాంకులు సాధించినవారు ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరారని.. ఎస్ఐటీ, ట్రిపుల్ఎస్ ఐటీ సీట్ల భర్తీ కోసం జరుగుతున్న సీ-శాట్ కౌన్సెలింగ్ శనివారం వరకు ఉన్నందున మూడో విడతలో ఖాళీలు భర్తీ అవుతాయని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సంప్రదాయ కోర్సులకు ఆదరణ రాష్ట్రంలో తొలి సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూలో 13 ఇంజినీరింగ్ బ్రాంచుల్లో 693 సీట్లున్నాయి. 
 
గతంలో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లన్నీ భర్తీ అయ్యేవి. ఇందుకు భిన్నంగా క్యాంపస్‌లో సీట్లు మిగిలాయి. 693 సీట్లకుగాను 635 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించి.. ఆయా బ్రాంచుల్లో చేరుతున్నామని అధికారులకు ధ్రువపత్రాలు సమర్పించారు. బ్రాంచులవారీగా ఖాళీలను పరిశీలిస్తే.. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కు మళ్లీ ఆదరణ పెరుగుతోందని నిర్ధారణ అయ్యింది. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో 66 సీట్లుండగా... రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 65 సీట్లు భర్తీ అయ్యాయి. 
 
ఇదే తరహాలో మెకానికల్లో 66 సీట్లకు 63 మంది విద్యార్థులు చేరారు. ఎలక్ట్రికల్లో 66 సీట్లుండగా.. 57 మంది విద్యార్థులు ఎంచుకున్నారు. సంప్రదాయ కోర్సులతోపాటు కెమికల్, బయోటెక్నాలజీ, మెటలర్జీ ఇంజినీరింగ్ బ్రాంచుల్లో 99 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. మెటలర్జీ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతుండడంతో విద్యార్థులు ఈ బ్రాంచులను ఎంచుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు