కోవిడ్ కాలంలో మీ భవిష్యత్‌ను ఏవిధంగా నిర్మించుకోవాలి?: 12వ వార్షిక ఉపన్యాసంలో నిట్ యూనివర్శిటీ
మంగళవారం, 24 నవంబరు 2020 (18:09 IST)
ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన సమాజంలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేని నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ 12వ వార్షిక ఉపన్యాసంకు ఆతిథ్యమిచ్చింది. పద్మభూషన్ అవార్డు గ్రహీత, ఫౌండర్ అండ్ ఛైర్మన్ మెడాంటా మెడిసిటీ డాక్టర్ నరేష్ ట్రెహాన్ ఈ ఉపన్యాసం అందించారు. కోవిడ్ కాలంలో మీ భవిష్యత్‌ను నిర్మించండి అనే అనే అంశంపై డాక్టర్ ట్రెహాన్ ఈ వార్షిక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమం 23 నవంబర్ 2020వ తేదీ జరిగింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం గురించి డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం ఏవిధంగా మనం జీవిస్తున్న, పనిచేస్తున్న మరియు అభ్యసిస్తున్న విధానంలో మార్పులను తీసుకువచ్చినదీ వివరించారు. ఆయనే మాట్లాడుతూ నేటి విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో సాంకేతికత పాత్ర మరియు వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో విజయగాథలను లిఖిస్తున్న భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో ఎన్‌యు లాంటి విద్యాసంస్థలు ఏవిధంగా తోడ్పడతాయి లాంటి అంశాలను గురించి కూడా మాట్లాడారు.
డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ నూతన సాధారణత ఏవిధంగా ఇక్కడ ఉండబోతున్నది వివరించారు అలాగే సురక్షితంగా ఉండాల్సిన ఆవశ్యకతనూ తెలిపారు. రోగ నిరోధక శక్తి మెరుగుపరుచుకోవడం, మాస్కులను ధరించడం, భౌతిక దూరం ఆచరించడమనేవి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన గోల్డెన్ రూల్స్‌గా మారాయి. ఆయనే మాట్లాడుతూ భారతదేశం సూపర్‌పవర్‌గా మారుతున్న వేళ, ప్రపంచశ్రేణి విద్యాసంస్థలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది మరియు భారతీయ విద్యార్ధులు సంపూర్ణ అభివృద్ధికి మార్గనిర్ధేశనమూ చేయాల్సి ఉంది. అవసరమైన మార్గదర్శకాలన్నీ కూడా అందుకున్న మోడల్ ఇనిస్టిట్యూట్‌గా ఎన్‌యును అభినందించారు డాక్టర్ ట్రెహాన్.
ఈ వార్షిక ఉపన్యాసం నిట్ యూనివర్శిటీ యొక్క యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ హ్యాండిల్స్‌పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. శ్రీ రాజేంద్ర ఎస్ పవార్, ఫౌండర్, నిట్ యూనివర్శిటీ మాట్లాడుతూ, నేటి కాలంలో మీ కెరీర్‌లను భవిష్యత్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడంలో, ప్రతి వ్యక్తికీ మెరుగైన పునాది ఉండాల్సిన అవసరం ఉంది. అది డిజిటల్‌గా ఉంది. మహమ్మారి మనల్ని తాకక మునుపటి కన్నా వేగంగా ఇప్పుడు ప్రపంచం మారుతుంది. అందువల్ల, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారనే అంశంతో సంబంధం లేదు. నూతన తరపు సాంకేతిక వేదికలు, డిజిటల్ పద్ధతులు, ఉపకరణాలపై మీకు పూర్తి అనుభవం ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సురక్షితంగా ఉండేందుకు మార్గాలనూ అనుసరించాల్సి ఉంది. ఎన్‌యు క్యాంపస్ వద్ద, మేము క్యాంపస్‌ను పూర్తిగా శానిటైజ్ చేయడం ద్వారా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నామనే భరోసా అందిస్తున్నాం అని అన్నారు.
ప్రొఫెసర్ పరిమల్ వీ మండ్కీ, అధ్యక్షుడు, నిట్ యూనివర్శిటీ మాట్లాడుతూ, ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్నది ఎన్‌యు వద్ద ఇది మా నిరంతర ప్రయత్నం. అదే రీతిలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటుగా ఒకరి అసలైన సామర్థ్యం కనుగొనేందుకు సాంకేతిక వినియోగం చేస్తున్నాం. గత 11 సంవత్సరాలుగా మేము విజయవంతంగా నూతన నమూనా సమగ్రమైన అభ్యాసం సృష్టిస్తున్నాం. ఇది ఎలాంటి సవాళ్లు ఎదురైనా మా విద్యార్థులు భవిష్యత్‌కు సిద్ధమైనట్లుగా తీర్చిదిద్దగలం అని అన్నారు.
మేజర్ జనరల్ ఏ కె సింగ్ (రిటైర్డ్), సీఓఓ అండ్ డీన్ స్టూడెంట్ ఎఫైర్స్, నిట్ యూనివర్శిటీ మాట్లాడుతూ, ఇంటి కన్నాసురక్షితమైనది ఎన్‌యు క్యాంపస్ మరియు 250 రోజులకు పైగా ఇన్‌ఫెక్షన్ ఫ్రీగా కొనసాగుతుంది. భద్రత మరియు రక్షణ పరంగా మార్గదర్శకాలను అనుసరిస్తూ విద్యార్థులను తిరిగి స్వాగతించేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాము. అదే సమయంలో పూర్తి సౌకర్యవంతమైన, వినూత్నమైన అభ్యాస అనుభవాలను మరియు తగిన అవకాశాలను ఫిజికల్ ఫిట్‌నెస్ మరియు సామాజిక సంభాషణలకు కోవిడ్ 19 మార్గదర్శకాలకు లోబడి అవకాశాలను అందిస్తున్నాం అని అన్నారు.
సర్వోత్తమ సంస్థగా నేపథ్యీకరించబడిన ఎన్‌యు, అసాధారణ విద్యను నాలుగు ముఖ్య మూలసూత్రాలతో అందిస్తుంది. ఇది అభ్యాసాన్ని పరిశ్రమ అనుసంధానత, టెక్నాలజీ ఆధారిత, పరిశోధన సంబంధిత మరియు క్లిష్టతరం కానటువంటి రీతిలో అందిస్తుంది. బలీయంగా పరిశ్రమను అనుసంధానించడం మరియు పరిశోధనాధారిత విధానంపై దృష్టి పెట్టడం ద్వారా విజ్ఞాన ఆర్ధిక వ్యవస్ధలో అభివృద్ధి చెందుతున్న అవసరాలను అందుకునేందుకు ఎన్‌యు సిద్ధంగా ఉంది.