భవిష్యత్‌ కెరీర్‌లకు అనుగుణంగా నిట్‌ యూనివర్శిటీ నాలుగు నూతన ప్రోగ్రామ్‌ల పరిచయం

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (16:36 IST)
ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంగణాలలో అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్ధ నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) నాలుగు నూతన ప్రోగ్రామ్‌లను నూతన విద్యాసంవత్సరం- 2021 కోసం కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌; డేటా సైన్స్‌లో బీటెక్‌; సైబర్‌ సెక్యూరిటీలో బీటెక్‌ ; బిజినెస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌లో బ్యాచిలర్స్‌ కోర్సులను పరిచయం చేసింది. ఈ ప్రోగ్రామ్‌లను ప్రత్యేకంగా విద్యార్థులకు ఉద్యోగార్హతలను అందించడంతో పాటుగా భవిష్యత్‌ కార్యకలాపాల కోసం నూతన తరపు నైపుణ్యాలనూ అందించేందుకు తీర్చిదిద్దారు.
 
ప్రొఫెసర్‌ పరిమల్‌ మన్డ్కీ, యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌, నిట్‌ యూనివర్శిటీ మాట్లాడుతూ, ‘‘పోటీ ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను చాటడానికి నూతన నైపుణ్యాలను సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. నూతన తరపు నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నూతన ప్రోగ్రామ్‌లు అత్యుత్తమ అభ్యాసాన్ని మా అసాధారణ ఫ్యాకల్టీ ద్వారా అందిస్తున్నాం...’’ అని అన్నారు.
 
బీటెక్‌ డాటా సైన్స్‌ డిగ్రీ నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ కాగా, ఈ కోర్సు చేసిన విద్యార్థులు డీఎస్‌/ఏఐ/ఎంఎల్‌లలో కెరీర్‌లను పొందవచ్చు. అదే రీతిలో బీటెక్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థులు డిజిటల్‌, డిస్ట్రిబ్యూషన్‌ కంట్రోల్స్‌లో నైపుణ్యం పొందగలరు. సైబర్‌ సెక్యూరిటీ కోర్సును పరిశ్రమ అవసరాలు, మానవ వనరుల నైపుణ్యాల నడుమ ఖాళీని పూరించేందుకు రూపొందిస్తే, బీబీఏ డిగ్రీను బిజినెస్‌ ఎనలిటిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ తదితర అంశాలలో నూతన నైపుణ్యాలను పొందేలా తీర్చిదిద్దారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు