భారతీయులు ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి సాఫ్ట్ స్కిల్స్-AI సామర్ధ్యం అత్యంత కీలకం: లింక్డ్ఇన్

గురువారం, 24 ఆగస్టు 2023 (17:09 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్‌ఇన్ తమ మొట్టమొదటి గ్లోబల్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్: స్టేట్ ఆఫ్ వర్క్ AI నివేదికను విడుదల చేసింది, ఇది ఉగ్యోగ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానంగా వెల్లడి చేస్తుంది. జనవరి 2016తో పోల్చితే జూన్ 2023లో భారతదేశంలో AI-నైపుణ్యం కలిగిన సభ్యులు 14 రెట్లు పెరిగారని భారతదేశ వ్యాప్తంగా చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ వృద్ధి సింగపూర్, ఫిన్‌లాండ్, ఐర్లాండ్ మరియు కెనడాతో పాటుగా AI ప్రతిభను వృద్ధి చేసుకుంటున్న  టాప్ 5 దేశాలలో ఇండియా ను నిలిపింది. కార్యాలయంలో AI స్వీకరణ పెరగడంతో భారతదేశం AI అభ్యాసాన్ని స్వీకరిస్తుంది.
 
గత సంవత్సర కాలంలో, భారతీయ శ్రామిక శక్తిలో 43% మంది తమ కార్యాలయాల్లో ఏఐ వినియోగాన్ని పెంచటం చూశారు. ఈ పెరుగుదల భారతదేశంలోని 60% మంది కార్మికులను మరియు 71% Gen Z నిపుణులను AI నైపుణ్యాలను పొందడం కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తుందని గుర్తించడానికి ప్రేరేపించింది. అంతే కాదు, ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్‌నైనా నేర్చుకుంటామని వెల్లడిస్తున్నారు. AI మరియు మెషిన్ లెర్నింగ్‌లు తాము నేర్చుకోవాలనుకునే అత్యుత్తమ నైపుణ్యాలలో తొలిస్థానాలలో ఉంటున్నాయని అంటున్నారు.
 
భారతదేశంలో AI నైపుణ్యం, నియామకం మరియు విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోన్న నాయకులు
AI నైపుణ్యాలు పుంజుకోవడంతో, జాబ్ మార్కెట్‌పై వాటి ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2022లో, AI ప్రతిభావంతులను తీసుకోవడంలో పెరుగుదల APACలో మొత్తం నియామకాలను అధిగమించింది. భారతదేశం కోసం, 2023 AI నియామకాల పరంగా  నిరంతర వృద్ధిని వాగ్దానం చేస్తుంది, భారతదేశపు టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో సగం మంది ఈ సంవత్సరం AI ప్రతిభను మెరుగుపరచడం లేదా నియమించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో, 57% మంది ఎగ్జిక్యూటివ్‌లు వచ్చే ఏడాది తమ సంస్థల్లో AI వినియోగాన్ని మెరుగుపరచాలని యోచిస్తున్నారు,  ఇది  ప్రస్తుత వ్యాపార సంస్థలు తమ ప్రస్తుత వర్క్‌ఫోర్స్‌ను చురుకుగా రీస్కిల్ చేస్తున్నాయని  , తద్వారా తమ బృందాలు చురుకైన మరియు స్వీకరించ తగిన రీతిలో  వుండాలని కోరుకుంటున్నారని మాకు తెలియజేస్తుంది.
 
AI యుగంలో సాఫ్ట్ స్కిల్స్ అత్యంత కీలకంగా మారాయి 
AI యుగంలో సృజనాత్మకత మరియు కమ్యూనికేషన్‌ వంటి సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యత భారతదేశంలో అధికంగా ఉంది,  ప్రపంచ సగటు 72%ని అధిగమిస్తూ . 91% మంది ఉన్నతాధికారులు వీటికి పెరిగిన ప్రాముఖ్యతను గుర్తించారు. ప్రతి 10లో 7 మంది (69%) నిపుణులు సృజనాత్మకత మరియు సమస్య పరిష్కారం (ప్రాబ్లెమ్ సాల్వింగ్)  వంటి సాఫ్ట్ స్కిల్స్,  పని చేయడానికి కొత్త దృక్పథాన్ని తీసుకురావడానికి వీలు కల్పిస్తాయని నమ్ముతున్నందున భారతీయ శ్రామిక శక్తిలో ఎక్కువ మంది ఈ భావాన్ని అంగీకరిస్తున్నారు.
 
హైదరాబాద్‌లోని టాలెంట్ ల్యాండ్‌స్కేప్ గురించి లింక్డ్‌ఇన్ ఇండియా వద్ద  టాలెంట్ & లెర్నింగ్ సొల్యూషన్స్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ మాట్లాడుతూ, “నేటి అభివృద్ధి చెందుతున్న లేబర్ మార్కెట్‌లో, హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయమైన కేంద్రం గా ఉద్భవించింది, ఢిల్లీ, పూణే మరియు విజయవాడ వంటి నగరాల నుండి నిపుణులను స్థిరంగా ఆకర్షిస్తుంది. హైదరాబాద్‌లోని ప్రొఫెషనల్స్ ఎదగడానికి ఆసక్తిగా ఉన్నారు, 47% మంది రేపటి డిమాండ్‌లకు అనుగుణంగా కొత్త, డిమాండ్‌లో వున్న నైపుణ్యాలను నేర్చుకోవాలనుకుంటున్నారు. భారతదేశంలోని ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పుడు సరైన సాఫ్ట్ మరియు AI నైపుణ్యాలతో కూడిన  ప్రతిభను పొందాలని చూస్తున్నందున, ఈ రంగాలలో నైపుణ్యం సాధించడం అనేది తెలంగాణలోని కార్మికులకు విజయవంతమైన కెరీర్‌లను నిర్మించడానికి మరింత అవసరం. లేబర్ మార్కెట్ అభివృద్ధి చెందుతూనే ఉన్నందున, ఈ పరివర్తన కాలంలో సరైన నైపుణ్యాలు, జ్ఞానం మరియు నెట్‌వర్క్‌లతో  భావి మార్పుల కంటే ముందు ఉండేందుకు మరియు విజయం సాధించడానికి నిపుణుల కోసం లింక్డ్‌ఇన్ గో-టు ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది..." అని అన్నారు. 
 
లింక్డ్‌ఇన్ ఇండియా  కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ, “ పని యొక్క భవిష్యత్తును AI రూపొందిస్తున్నందున, భారతదేశం తమ  మానవ సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి శ్రామికశక్తిని నిర్మించడంలో సాఫ్ట్ స్కిల్స్ పోషించే కీలక పాత్రను గుర్తిస్తుంది. AI  యుగంలో  వ్యక్తుల సహజ  నైపుణ్యాల శక్తిని  భారతదేశం యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఆమోదించడం తో , మేము మరింత సంతృప్తికరమైన, మానవ-కేంద్రీకృత పనికి విలువనిచ్చే యుగంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ క్షణాన్ని ఒడిసి పట్టుకోవడానికి, నాయకులు తప్పని సరిగా నైపుణ్యాలకు తొలి ప్రాధాన్యత అనే తమ నిబద్ధతను పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే పారంపర్యత కంటే సామర్ఢ్యమునకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రతిభను విస్తరించవచ్చు, నైపుణ్యాన్ని పెంచవచ్చు మరియు వారి శ్రామికశక్తిలో చురుకుదనాన్ని పెంపొందించవచ్చు..." అని అన్నారు. 
 
“తొలుత నైపుణ్యాలు అనే  మనస్తత్వాన్ని పెంచుకోవటం ద్వారా, మన దేశంలోని యువతకు - ముఖ్యంగా పట్టణ కేంద్రాలకు ఆవల నివసించే వారికి - సరైన డిజిటల్ మరియు మానవ నైపుణ్యాల కలయికతో సాధికారత కల్పించడానికి మేము అద్భుతమైన అవకాశాన్ని కలిగి ఉన్నాము, తద్వారా వారు అర్ధవంతమైన జీవనోపాధిని కలిగి ఉంటారు మరియు భవిష్యత్తులో పని చేయగలరు, ” అని అన్నారాయన.
 
 తొలుత నైపుణ్యాల- లేబర్ మార్కెట్‌ను సృష్టించాలనే తమ  నిబద్ధతతో, లింక్డ్‌ఇన్  మూడు సంవత్సరాల భాగస్వామ్యం తో  ది/నడ్జ్ ఇన్‌స్టిట్యూట్‌ లో   INR 3 కోట్లను పెట్టుబడి పెడుతోంది. అందరికీ స్థిరమైన జీవనోపాధిని నిర్మించడంలో లాభాపేక్షలేని సంస్థ ది/నడ్జ్ ఇన్‌స్టిట్యూట్‌. ఈ భాగస్వామ్యం భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి తోడ్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు