తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు విజయఢంకా మోగించారు.
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన గురుకుల పాఠశాల విద్యార్థులు, గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో కూడా అత్యధికగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉత్తీర్ణతా శాతం 75.68 శాతంగా ఉంది.
మరోవైపు, ఆగస్టు ఒకటో తేదీ నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సిప్లమెటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 18వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయొచ్చని వివరించారు.