* చిన్నారుల్లో సాధారణంగా వచ్చే సమస్యల్లో మలబద్ధకం ఒకటి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే పిల్లల్ని ఈ సమస్యనుంచి బయట పడవేయవచ్చు. సాధారణ స్థితిలో కాకుండా, మలం గట్టిపడి విరోచనం సరిగా అవని కారణంగా మలబద్ధకం వస్తుంటుంది. ఆహారపు అలవాట్లలో తేడాలే దీనికి ముఖ్య కారణం. ఇది అన్ని వయసుల పిల్లల్లోనూ వస్తుంటుంది.
* ముఖ్యంగా పోతపాలు తాగే పసిపిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. మలం గట్టిగా మారటంతో బయటకు రాదు, దీంతో పిల్లలు కడుపునొప్పితో బాధపడటంతోపాటు మలం బయటకు రావడానికి ఊపిరి బిగబట్టి బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. దీంతో మలద్వారం చుట్టూ పగిలి రక్తం రావటం, నొప్పి, మంట పుట్టడం లాంటివి జరుగుతాయి.
* పిల్లల్లో మలబద్ధకం వచ్చినట్లు గుర్తించగానే ఆహారంలో మార్పులు చేయటం మంచిది. విరేచనం సులభంగా అయ్యేందుకు ఉపయోగపడే పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు లాంటివి పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వాలి. అలాగే రసం, మజ్జిగలతో కూడిన భోజన పెట్టాలి. అన్నం తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు త్రాగే అలవాటు చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ మలబద్ధకం తగ్గకపోతే వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.