డిసెంబర్ ఫుల్ మూన్ గురించి తెలుసా? 4 ప్రత్యేకతలున్నాయ్..!

సోమవారం, 28 డిశెంబరు 2020 (10:19 IST)
చంద్రుడు ఈ ఏడాది ముగిసేలోపు సంపూర్ణంగా కనిపించబోతున్నాడు. దీన్నే డిసెంబర్ ఫుల్ మూన్ అంటున్నారు. అంటే ఈ నెలలో సంపూర్ణ చందమామను మనం చూడబోతున్నాం. ఈసారి వచ్చే ఫుల్ మూన్‌కి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదే సంవత్సరంలో వచ్చే చివరి ఫుల్ మూన్. 
 
మంచు వాతావరణంలో ఈ చందమామ సరికొత్తగా కనిపించనుంది. డిసెంబర్ 21 నుంచి పగటి సమయం కంటే రాత్రి సమయం పెరుగుతోంది. అంటే ఈ ఫుల్ మూన్... రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజుల్లో రాబోతోంది. 
 
ఈ చందమామను అమెరికాలో లాంగ్ నైట్స్ మూన్ (లాంగ్ నైట్స్ మూన్), కోల్డ్ మూన్ (Cold Moon) అని పిలుస్తున్నారు. క్రిస్మస్ తర్వాత వచ్చే సంపూర్ణ చందమామను అలా పిలుస్తారు. యూరప్‌లో యూలే తర్వాత వచ్చే చందమామ (Moon after Yule) అంటారు.
 
2020 చివర్లో వచ్చే ఈ కోల్డ్ మూన్... ఈ సంవత్సరంలో వచ్చిన 13వ సంపూర్ణచందమామ. ఇది వరుసగా రెండు రోజులు కనిపిస్తుంది. మొదటిది డిసెంబర్ 29న అంటే మంగళవారం రాత్రి కనిపిస్తుంది. రాత్రంతా కనిపిస్తుంది. మంగళవారం కంటే... బుధవారం ఇంకా సంపూర్ణంగా ఉన్న చందమామ కనిపిస్తుంది. భారతీయులు దీన్ని కళ్లారా చూడవచ్చు.
 
డిసెంబర్ 29న రాత్రి 10.30కి సంపూర్ణ చందమామ అమెరికాలో మొదలవుతుంది. భారతీయులకు మాత్రం డిసెంబర్ 30 ఉదయం 8.58కి మొదలవుతుంది. ఐతే... 29 రాత్రి, 30 రాత్రి వేళ చందమామ సంపూర్ణంగానే కనిపిస్తుంది. ఈ రెండ్రోజులూ టెలీస్కోప్ పెట్టి చూస్తే చందమామ ఎంతో కాంతివంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇందుకు కారణం... గాలిలో ఉండే మంచే. కంటికి కనిపించని అతి చిన్న మంచు కణాలు... గాలిలో ఎగురుతూ చందమామను మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు