కావలసిన పదార్థాలు : పెరుగు... ఆరు కప్పులు మామిడిపండు లేదా స్ట్రాబెర్రీ లేదా ఆరంజ్ పండ్ల ప్యూరీ... నాలుగు కప్పులు పంచదార పొడి... ఆరు టీ. వెనీలా ఎసెన్స్... ఒక టీ. గార్నిష్ కోసం పుదీనా ఆకులు... కాసిన్ని నిమ్మ తరుగు.... కొద్దిగా
తయారీ విధానం : పెరుగు, పండ్ల ప్యూరీ, పంచదార, వెనీలా ఎసెన్స్లను మిక్సర్లో వేసి బ్లెండ్ చేయాలి. కప్పులోకి పెరుగు, పండ్ల ప్యూరీ మిశ్రమాన్ని తీసుకుని పైన పుదీనా, నిమ్మతరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లగా కావాలనుకునేవారు ఫ్రిజ్లో పెట్టిన పెరుగు, పండ్లప్యూరీ మిశ్రమాన్ని తీసి గార్నిష్ చేసి తినవచ్చు.
పెరుగులో కాల్షియం సమృద్ధిగా లభించటంవల్ల ఎముకల బలానికి సహకరిస్తుంది. దంతాలు గట్టిపడతాయి. పండ్లలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు, గుండె బలానికి తోడ్పడతాయి. అంతేగాకుండా శరీరానికి సోకే పలురకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడతాయి.