చూడముచ్చటైన క్రిస్మస్ "హనీ క్యాండీలు"

FILE
కావలసిన పదార్థాలు :
క్రీం.. ఒక కప్పు
పంచదార.. ఒక కప్పు
తేనె.. ఒక కప్పు
వెన్న.. అర కప్పు
వెనిలా ఎసెన్స్.. ఒక టీ.
గ్రీన్ ఫ్రూఫ్ కాగితం.. ఒకటి
పాలరాతి బిళ్లలు.. తగినన్ని (ఒకే సైజు, ఒకే ఎత్తు, పొడవుగా ఉండేవి)

తయారీ విధానం :
వెడల్పాటి పాత్రలోకి క్రీం తీసుకుని, అందులో పంచదార, వెన్న, తేనె, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరువాత ఒకటి వేయాలి. పంచదార, వెన్న కరిగేంతదాకా సన్నటి మంటపై ఉంచి కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టిపడిందీ లేనిదీ తెలుసుకోవాలంటే అర చెంచాడు మిశ్రమాన్ని తీసుకుని బాగా చల్లటి నీటిలో వేయాలి. గట్టిపడి ఉన్నట్లయితే పట్టుకోగానే ఉండలా అవుతుంది. అలా గట్టిపడినట్లు నిర్ధారణ చేసుకున్నాక స్టౌ ఆపివేయాలి.

ఇప్పుడు గ్రీన్ ఫ్రూఫ్ కాగితాన్ని పరచి చుట్టూ పాలరాతి బిళ్లల్ని ఉంచాలి. అందులో తేనె మిశ్రమాన్ని వంపాలి. మిశ్రమం గట్టిపడ్డాక రాళ్లను తీసివేయాలి. మందంగా ఉండే కత్తికి నూనె లేదా నెయ్యి రాసి పొడుగ్గా కోయాలి. అంతే క్యాండీలు సిద్ధం. అయితే పలుచటి ప్లాస్టిక్ కాగితంలో ఉంచి, రెండువైపులా ముడివేసి సర్వ్ చేసినట్లయితే చూడముచ్చటగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి