పుట్టగొడుగులతో చైనీస్ సూప్ తయారు చేయడం ఎలా...?

గురువారం, 27 జూన్ 2013 (18:04 IST)
FILE
కావాల్సిన పదార్థాలు :
వెజిటబుల్ స్టాక్ : నాలుగు కప్పులు
పుట్టగొడుగులు : అరకప్పు
బేబీకార్న్ ముక్కలు : అరకప్పు
పాలాకులు : పది పన్నెండు
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : అర టీ స్పూన్
సోయా సాస్ : ఒక టీ స్పూన్
వెనిగర్ : రెండు టీ స్పూన్లు


తయారు చేయు పద్ధతి :
వెజిటబుల్ స్టాక్‌లో పుట్టగొడుగులు, బేబీకార్న్, క్యారెట్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు మరగబెట్టాలి. పాలాకు, ఉప్పు వేసి కలియబెట్టి ఇంకొద్దిసేపు మరిగించాలి. నూనె వేసి కలిపి కొద్ది సెకన్లు ఉంచి దింపేయాలి. సర్వ్‌చేసే ముందు సోయాసాస్, వెనిగర్ కలపాలి.

వెబ్దునియా పై చదవండి