దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు : నేతల శుభాకాంక్షలు

బుధవారం, 25 డిశెంబరు 2013 (11:50 IST)
File
FILE
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలోని క్రైస్తవులందరికీ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనల స్ఫూర్తితో దేశవాసులందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశ్వమానవ సౌభ్రాత్రానికి ప్రతీకగా అవతరించిన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని గవర్నర్ నరసింహన్ అన్నారు. జాతి, కులమతాలకు అతీతంగా క్రిస్మస్ ప్రపంచంలో అందరికీ పండుగేనని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి