కావలసిన పదార్థాలు : మైదాపిండి.. అర కప్పు కండెన్స్‌డ్ మిల్క్.. ఒక టీ. వెన్న.. ఎనిమిది టీ. ఐషింగ్ సుగర్.. 300 గ్రా చెర్రీలు.. 200 గ్రా. వంటసోడా.. 2 టీ. ఉప్పు.. తగినంత స్టాబెర్రీ ఎసెన్స్.. అర కప్పు ఎర్రటి మిఠాయి రంగు.. అర టీ. వేడినీరు.. నాలుగు టీ.
తయారీ విధానం : ముందుగా కండెన్సెడ్ మిల్క్‌లో వేడినీళ్లు, కరిగించిన వెన్న వేసి బాగా గిలక్కొట్టాలి. దాంతో పాటు.. ఉప్పు, వంటసోడా, చెర్రీపండ్లను మైదాపిండిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 12 సెం.మీల కేక్ డబ్బాలో బ్రౌన్ పేపర్ పరిచి తయారుచేసుకొన్న మిశ్రమాన్ని వేసి అరగంటపాటు ఓవెన్‌లో ఉంచాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 350 డిగ్రీలు దాటకుండా చూడాలి.
ఇప్పుడు ఓవెన్‌లోని మిశ్రమం ఉడికేలోగా ఐషింగ్ షుగర్, మిఠాయిరంగు పొడిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఓవెన్‌లో ఉడికించిన కేక్‌ను నుంచి తీసి ఐషింగ్ షుగర్ మిశ్రమాన్ని కేక్‌పై పోయాలి. అంతే చెర్రీ కేక్ తయారవుతుంది. దీనిని సర్వ్ చేసేముందు పండ్ల ముక్కలతో అలంకరిస్తే చూసేందుకు భలే ఆకర్షణీయంగా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.