నిజానికి ఈ టీకాను బ్రిటన్‌లో ఇప్పటికే 1.8 కోట్ల మందికి వేశారు. అయితే, టీకా తీసుకున్నవారిలో ఏడుగురు వ్యక్తులు రక్తం గడ్డకట్టడం ద్వారా మరణించినట్టు యూకే హెల్త్ రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది. అయితే, ఇది టీకా వలన జరిగిందా మరేదైనా కారణమా అన్నది పూర్తిగా తేలలేదని చెప్పింది.
బ్రిటన్‌లోని మెడికల్ అండ్ హెల్త్ రేగులటరీ ఏజన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చెబుతున్నదాని ప్రకారం బ్రిటన్‌లో ఆస్ట్రాజెనికా వాక్సిన్ తీసుకున్న వారిలో 30 మందికి రక్తం గడ్డకట్టినట్టినట్టు గుర్తించారు. సెరిబ్రల్ వెయిన్ థ్రోమ్బోసిస్ లక్షణాలతో 22 మంది, ఇతర రకాలైన థ్రోమ్బోసిస్ తో 8 మంది బాధపడుతున్నట్టు మార్చి 24 వతేదీన గుర్తించారు. దీంతో వివిధ ప్రాంతాల్లో ఆస్ట్రాజెనికా టీకా వినియోగంపై ఆంక్షలు విధించారు.
కెనడాలో 55 యేళ్ళలోపు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జెర్మనీలో కూడా 60 సంవత్సరాల లోపు వారికి ఈ టీకా ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. అయితే, బ్రిటన్ మాత్రం ఈ వ్యాక్సిన్ అన్నివయసుల వారికీ సురక్షితం అనే చెబుతోంది.