ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తం గడ్డ కడుతోంది.. యూకేలో 25 కేసులు

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (19:46 IST)
ఆస్ట్రాజెనెకా టీకా వికటించింది. ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా రక్తం గడ్డ కట్టినట్టు భావిస్తున్న 25 కేసులు యూకేలో వెలుగు చూశాయి. యూరప్‌లోని మరికొన్ని దేశాల్లోనూ ఇలాంటి కేసులే పెద్ద ఎత్తున వెలుగు చూడడంతో ఆస్ట్రాజెనెకా టీకాపై ఆయా దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి.

తాజా కేసులతో కలుపుకుని బ్రిటన్‌లో ఇటువంటి కేసుల సంఖ్య 30కి పెరిగింది. అయితే, వ్యాక్సిన్ ప్రయోజనాలు మాత్రం కరోనా ముప్పును అధిగమించేలా చేస్తాయని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది.
 
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిపి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. అయితే, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టుకుపోతున్నట్టు పలు దేశాలు ఆరోపించడంతో టీకాపై అనుమానాలు తలెత్తాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఈ టీకాను వినియోగిస్తున్నాయి.
 
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ టీకాపై వస్తున్న ఆరోపణలను కొట్టిపడేసింది. యూకే వ్యాప్తంగా మార్చి 24 నాటికి 18.1 మిలియన్ డోసులు ఇవ్వగా రక్తం గడ్డకట్టిన కేసులు 30 వెలుగు చూశాయి. అంతకుముందు మార్చి 18 నాటికి 11 మిలియన్ షాట్స్ ఇవ్వగా 5 కేసులు నమోదయ్యాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు