కరోనా వైరస్ వేగం పుంజుకుందా? దేశంలో పెరిగిపోతున్న కేసులు

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:33 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో వేగం పుంజుకుందా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే దేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,601కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడి మొత్తం 590 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గత 24 గంటల్లోనే 47 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మరోవైపు, ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 3252 మంది కోలుకున్నట్టు చెప్పారు. అలాగే, వివిధ ఆస్పత్రుల్లో 14,759 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. 
 
ఇకపోతే, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,666కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 232 మంది మృతి చెందారు. 572 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 431 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గుజరాత్‌లో 1,939 మందికి కరోనా సోకగా, 131 మంది కోలుకున్నారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 1,520 మందికి కరోనా సోకింది. వారిలో 457 మంది కోలుకున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 1,576 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 205 మంది కోలుకోగా, 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు