కరోనా కాలంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల్లో కోవిడ్‌తో ఆస్పత్రుల పాలైనవారి సంఖ్య రెట్టింపయింది.
ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుండడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్తగా లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
వైరస్‌ను ఎలా అదుపు చేయాలనే అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ అత్యవసర సమావేశం జరిపారు. తిరిగి కర్ప్యూ విధించడమో లేదా పాఠశాలలకు శలవులు పెంచడమో చేయాలని నిపుణులు కోరుతున్నారు.
కానీ అనుకున్న ప్రకారం జనవరి 3నే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. దీనికి బదులుగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పెంచితే సరిపోతుందని అంటున్నారు.
పొరుగున వున్న బెల్జియంలో సినిమా హాళ్ళు, కచేరీ హాల్స్‌తో సహా సాంస్కృతిక వేదికలన్నీ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.