కొత్తగా 15 వేల కోవిడ్ కేసులు - దేశంలో 90 వేలు - ఫోర్త్ వేవ్ తప్పదా?

శనివారం, 25 జూన్ 2022 (13:41 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 90 వేలు దాటిపోయాయి.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో గత 24 గంటల్లో మొత్తం 15940 కేసులు కొత్తగా నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. 
 
24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా నమోదైన కేసులు 15,940 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4205, కేరళలో 3,981 కేసులు ఉన్నాయి. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. అలాగే, 20 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి  సంఖ్య 12425గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసు సంఖ్య 91,779గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు